నదీ జలాల అంశం మీద కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్

-

కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుని ఆ విషయంలో ఏడేళ్ళగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తూర్పారబడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా తెలంగాణా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48 గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది.

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్ళగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొంద లేక పోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద పంపాలని ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version