కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్‌.. ముట్టుకుంటే మాడి మసైపోతరు: జీవన్‌రెడ్డి, గాదరి

-

కేసీఆర్‌ ను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు.. కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్‌..ముట్టుకుంటే మాడి మసైపోతారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌ అన్నారు.నల్లగొండలో కేసీఆర్‌ సభను అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామని చెప్పడం పిరికిపందచర్య అని,ఎంపీగా ఉన్న ఐదేళ్లలో ఒక్కరోజు ఈ ఏరియాలో ప్రెస్ మీట్ కూడా పెట్టని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని విమర్శించారు. చదువు లేని దద్దమ్మలు,అవగాహన లేని సన్నాసులు కృష్ణా జలాలను మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించడం చేతగానితనమని తీవ్రమైన విమర్శలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డికి ఆ శాఖపై కనీస అవగాహన కూడా లేదని చురకలు అంటించారు

తెలివి లేని ముఖ్యమంత్రి గా రేవంత్ రావడం ఇక్కడి ప్రజల దురదృష్టం అని అసహనం వ్యక్తం చేశారు . పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత నీటి సాగునీటిదని తెలిపారు. బ్రోకర్స్, జోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపులు భయపడేది లేదని,కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలి వచ్చినా కేసీఆర్ సభను అడ్డుకోలేరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version