రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయండి..కేసీఆర్

-

 

ప్రధాని మోదీ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం  సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. ముఖ్యంగా  రాష్ట్రానికి సంబంధించి  కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని 9 వెనుకబడిన ఉమ్మడి జిల్లాలకు ఏడాదికి ప్రతీజిల్లాకు 50 కోట్ల రూపాయ చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తుందని..అయితే 2017-18ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో విడత రావాల్సిన 450 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాలేదని ప్రధానికి తెలియజేశారు. వెంటనే వాటిని విడుదల చేసే విధంగా చర్య తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రం మిగులుగా ఉంది ..దీంతో రుణపరిమితిని పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా అదే స్థాయిలో రుణాలను మంజూరు చేయాలని మరో లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు ఇతర అంశాలను, జోనల్ విధానానికి ఆమోదం తెలపాలని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ప్రధానితో కేసీఆర్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఎంపీ వినోద్ హాజరయ్యారు. ముందుగా అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలుస్తారని అనుకున్నప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల కుదరలేదు. మరో రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో మరికొంత మంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news