ఈ 5 అలవాట్లు పాటిస్తే.. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు..!

-

అధిక బరువును తగ్గించుకోవడం కోసం నేటి తరుణంలో చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నా బరువు తగ్గలేకపోతున్నామని చాలా మంది ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన పలు అలవాట్లను నిత్యం తమ రోజువారీ దినచర్యలో చేర్చుకుంటే దాంతో బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రాత్రి నిద్రకు ముందు పెప్పర్‌మింట్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం రాత్రి పూట కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు.

2. రాత్రిపూట మద్యం సేవించరాదు. మద్యం రాత్రి పూట సేవించడం వల్ల శరీరం ఆ ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడం కోసమే పనిచేస్తుంది. దీని వల్ల ఇతర పనులను శరీరం నిర్వర్తించలేదు. కనుక రాత్రి పూట మద్యం సేవించడం మానుకోవడం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

3. రాత్రి పూట సాధారణంగా మనకు శక్తి తక్కువగా అవసరం అవుతుంది. కనుక తేలికపాటి ఆహారం తీసుకున్నా చాలు. అధికంగా భోజనం చేస్తే శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. అదే తక్కువగా తింటే శరీరం మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి మిగతా సమయాన్ని కొవ్వును కరిగించేందుకు ఉపయోగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.

4. రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యమైతే మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది కనుక ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయలేదు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే త్వరగా భోజనం చేస్తే శరీరంపై పని ఒత్తిడి ఉండదు. కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గుతారు.

5. చాలా మంది రాత్రి పూట భోజనంతోపాటు స్నాక్స్‌ను కూడా తింటారు. కానీ అలా చేయరాదు. వాటితో శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. కనుక స్నాక్స్‌ను రాత్రి పూట సేవించరాదు.

Read more RELATED
Recommended to you

Latest news