త్వ‌ర‌లో కేసీఆర్ జాతీయ పార్టీ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కీల‌క ప్ర‌కట‌న చేశారు. జాతీయ పార్టీ పెడుతారా.. అని జ‌ర్నలిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జాతీయ పార్టీని పెట్ట‌కూడ‌దా.. అని అన్నారు. పెడితే లాభమే కదా అని అన్నారు. జాతీయ పార్టీ పెడితే త‌న‌ను ఎవ‌రూ అడ్డుకుంటార‌ని అన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా అంద‌రూ న‌వ్వ‌ర‌ని అన్నారు.

అప్పుడు న‌వ్విన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. ఉద్య‌మం చేస్తామ‌ని తాను ప్ర‌క‌టించిన నాడు కూడా అంద‌రూ న‌వ్వార‌ని అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపించామ‌ని అన్నారు. ఇప్పుడు తాను జాతీయ పార్టీ పెట్టినా.. ఎవ‌రూ అడ్డుకోర‌ని అన్నారు. అవ‌స‌రం అయితే తాను జాతీయ పార్టీ పెట్ట‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని కూడా ప్ర‌క‌ట‌న చేశారు. కాగ ప్ర‌స్తుతం బీజేపీని ఓడించ‌డానికి అన్ని శ‌క్తులు ఏకం కావాల‌ని అన్నారు. అది ఫ్రంట్ గానీ పార్టీ గాని ఎదో ఒక‌టి అవుతుంద‌ని అన్నారు. దానిలో తాను మేజ‌ర్ పాత్ర పోషిస్తాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news