ఎల్లుండే హుజురాబాద్‌ లో కేసీఆర్ బహిరంగ సభ

-

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలో అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఇక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక అడుగు ముందుకేసి మరీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఎలాగైనా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ను ఓడించాలని గులాబీ బాస్‌ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యం లోనే ఈ నెల 16 వ తేదీన అంటే సోమవారం రోజున హూజూరాబాద్ లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా హుజురాబాద్‌ నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించనుంది టీఆర్ఎస్‌ పార్టీ. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించేందుకు హెలికాప్టర్ లో కరీంనగర్ బయలు దేరారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్. ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ సీఎం కేసీఆర్‌ పర్యటన పై సమీక్ష నిర్వహించనున్నారు. కాగా.. ఈటల రాజేందర్‌ రాజీనామా కారణంగా హుజురాబాద్‌ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news