తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఈ నెల 18వ తేదీన సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు.
అంతే కాక, శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఈనెల 18న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శరత్ తెలిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరెట్ కాంప్లెక్స్‌లో ఆడిటోరియం నందు జయంతోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటంకు నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.