కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 8 గంటల కరెంట్ ఇవ్వలేకపోతోంది : హరీశ్‌ రావు

-

బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్‌ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ అంటోందని, బీజేపీ మోటార్లు పెడతామని చెబుతోందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలిసిందే ధరలు పెంచడమే అన్నారు. కానీ కేసీఆర్ పేదలకు నిధులు పంచుతాడన్నారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అని పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయేమో మూడు గంటల విద్యుత్ అంటోందని, బీజేపీ మీటర్లు పెట్టాలని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం మీటర్లు పెట్టనందుకు రూ.35 వేల కోట్లను కేంద్రం ఆపిందని ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎనిమిది గంటల కరెంట్ ఇవ్వలేకపోతోందని, బెంగళూరు నగరంలోను కరెంట్ కోతలు
ఉన్నాయన్నారు. కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ గ్యాస్ సహా అన్ని ధరల్ని పెంచుతోందన్నారు. కానీ మనం ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్షఅమి, కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version