భార‌త‌దేశం అంతా మ‌న దిక్కు చూస్తోంది : హరీశ్‌ రావు

-

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ధ‌ర‌లు పెంచుడేమో బీజేపీ ప‌ని.. పేద‌ల‌కు నిధులు పంచుడేమో కేసీఆర్ ప‌ని అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు.

మన మిషన్ కాకతీయను కేంద్రం కాపీ కొట్టి అమృత్ సరోవర్ గా మార్చుకుంది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు బందును కిసాన్ సమ్మాన్ యోజన అని అమలు చేస్తున్నారు.. జిల్లాకో మెడికల్ కాలేజీ అని సీఎం అంటే, ప్రధాని కూడా అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు.. మన మిషన్ భగీరథను హర్ ఘర్ జల్ అని అమలు చేస్తున్నారు.. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నది అని మంత్రి పేర్కొన్నారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే, నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. మూడు గంటలు కావాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి.. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేయాలని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version