మరికాసేపట్లో మొదలు కానున్న.. కేసీఆర్ 2వ రోజు బస్సు యాత్ర..!

-

కేసీఆర్ బస్సు యాత్రని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో రెండవ రోజు బస్సు యాత్ర ని మొదలు పెట్టబోతున్నారు కేసీఆర్ సూర్యపేట నుండి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా వెళ్తూ కేసీఅర్ భువనగిరి చేరుకోనున్నట్టు తెలుస్తోంది సాయంత్రం 6 గంటలకు భువనగిరి లో నిర్వహించనున్న రోడ్డు షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గోనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. నల్లగొండ జిల్లా నుండి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్నీ మోగించింది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోరుగడ్డ నుండి కేసీఆర్ పోరుబాట పేరుతో బస్సు యాత్రను చేపట్టిన విషయం మనకి తెలిసిందే. కెసిఆర్ బస్సు యాత్ర 17 రోజుల కొనసాగుంది ఈ బస్సు యాత్ర 12 లోక్సభ స్థానాల పరిధిలో కొనసాగుతుంది ఈ బస్సు యాత్ర వచ్చేనెల 10వ తేదీన సిద్దిపేటకు చేరుకుంటుంది సిద్దిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించే బస్సు యాత్రని క్లోజ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news