ఆర్టీసీ కార్మికులు ఇక ఉద్యోగాలకు దూరమేనా…? కెసిఆర్ నిర్ణయం ఒక్కసారి చూస్తే…

-

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ విధంగా అడుగులు వేస్తారు…? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు గానూ కెసిఆర్ పెట్టిన గడువు ముగిసింది. ఈ సమ్మెపై హైకోర్ట్ లో గురువారం విచారణ జరుగుతు౦డటంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చర్చనీయంశంగా మారింది.

ప్రగతి భవన్ లో బుధవారం దాదాపు 9 గంటల పాటు ఆర్టీసి సమ్మెపై కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అజయ్ తో పాటుగా, పలువురు సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కెసిఆర్ కీలక నిర్ణయాలను వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. కార్మికులు విధుల్లోకి చేరడానికి ముందుకు రావడం లేదు కాబట్టి… దాదాపు అయిదు వేలకు పైగా రూట్లలో ప్రైవేట్ బస్సులను వినియోగించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదే విధంగా యూనియన్ల ముసుగులో ఆర్టీసి విషయంలో కొందరు నాయకులు అనుసరిస్తున్న తీరుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

కార్మికులతో చర్చలు జరపాలి అంటే వాళ్ళు లేకుండా ఉండాలని, కెసిఆర్ అధికారులతో అనగా వాళ్ళు లేకుండా కార్మికులు ముందుకు రారని అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కోర్ట్ కి చెప్పినట్టు సమాచారం. ఇక కార్మికులు ముందుకి రావడం లేదు కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఎక్కువ సర్వీసులను నడపాలని కెసిఆర్ భావిస్తున్నారట. కోర్ట్ విచారణ నేపధ్యంలో… ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన నిధులు, కార్మికులకు పెంచిన వేతనాలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న తేడాలను, వాళ్ళు సమ్మెకు పిలుపునివ్వడం కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని కోర్ట్ కి వివరించాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. దీని ఆధారంగా చూస్తే ప్రస్తుత౦ ఉన్న కార్మికులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version