తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బావుండాలని ప్రార్ధన చేశానన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు కేఏ పాల్. రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేసీఆర్ ప్రజా సేవ చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలన్నారు.
పాల్ లాంటి ఆదర్శ వ్యక్తి ఎక్కడా ఉండరని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియాకి చూపించారు పాల్. కేసీఆర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నేను అధికారంలోకి రావాలని కేసీఆర్ తన ఇష్ట దైవాన్ని కొలవాలన్నారు. నేను వస్తేనే తెలంగాణ 5 లక్షల కోట్లు అప్పులు తీర్చగలనన్నారు. దేశంలో ఉన్న ఆర్ధిక ,రాజకీయ సంక్షోభాలను నేనే పరిష్కరించగలనని.. రాజకీయాల నుంచి తప్పుకుని కెఏ పాల్ కి, ఎస్సి ఎస్టీలకు కెసిఆర్ సహకరించాలన్నారు.