కేసీఆర్ సంచలన నిర్ణయం…!

-

తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించడానికి ఇస్తాపడుతుందని అంటున్నారు. లాక్ డౌన్ ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేసే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు లాక్ డౌన్ వదిలేస్తే ఇబ్బందులు వస్తాయని ఆయన భావిస్తున్నారు.

అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ని ఎత్తేసే ఆలోచన తమకు లేదని, రాష్ట్రాల సరిహద్దులను కూడా మళ్ళీ అనుమతించే ఆలోచన తమకు లేదని కేసీఆర్ తెలిపే అవకాశాలు ఉన్నాయి. కరోనా కట్టడి విషయంలో చాలా వరకు కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా పెరుగుతుంది కాబట్టి రాష్ట్రాల సరిహద్దులను ఎత్తేసే ఆలోచన లేదని కేసీఆర్ స్పష్టంగా కేంద్రానికి చెప్పాలని చూస్తున్నారు. ప్రధాని ఆయనకు ఫోన్ చేసిన సమయంలో కూడా…

ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించగా పది రోజులు చూడాలని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని మోడీ సూచనలు చేసినట్టు సమాచారం. పది రోజుల తర్వాత కూడా రాష్ట్ర సరిహద్దులను తాము అనుమతించేది లేదని చెప్పినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని తాము ఎలాంటి ఛాన్స్ తీసుకోలేమని ఆయన చెప్పారట. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు 300కి దగ్గరలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version