చాలా దేశాల్లో ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పిన మాట విపక్షాలు వినే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రాజకీయ పట్టింపులు ఉంటాయి కాబట్టి చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనపడటం లేదు. జనతా కర్ఫ్యూ విషయంలో దేశం మొత్తం కూడా ఏకతాటి మీద నడిచింది. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కూడా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
ఇప్పుడు దీపాలు వెలిగించమని మోడీ చెప్తే ప్రతీ ఒక్కరు కూడా ముందుకి వచ్చి దీపాలను వెలిగించారు. విపక్షాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడిని తిట్టిన ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు దీపాలను వెలిగించారు. ఎవరూ కూడా మోడీ చెప్పారు మేము చెయ్యాలా అనే ఆలోచన లేకుండా ఎవరికి వారు స్వచ్చందంగా ముందుకి వచ్చి దీపాలని వెలిగించారు. రాజకీయ నాయకులు కూడా ముందుకి వచ్చారు.
మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు రాజకీయాలు పక్కన పెట్టి మోడీ చెప్పింది చేసారు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిణామం చూసి ఆశ్చర్యపోయింది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలా ఏకతాటి మీదకు వచ్చి పోరాటం చేయడానికి సిద్దం కావడం నిజంగా శుభ పరిణామం అని అంటున్నారు విదేశాల్లో ఉన్న వారు.