కేంద్ర గెజిట్‌ అమలుపై కేసీఆర్‌ కీలక నిర్ణయం !

-

కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమలు లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టు పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశ ముందని కేఆర్‌ఎంబీ బోర్డు ఉప సంఘం గుర్తించింది.

అయితే.. ఈ నేపథ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసు కున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టుల అప్పగింతకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయం తీసు కున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇందులో భాగం గానే అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీ వేశారు సీఎం కేసీఆర్. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఈఎన్సీ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీ నివేదిక తర్వాతనే ప్రాజెక్ట్ ల అప్పగింత పై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఫైనల్‌ అయినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version