టార్గెట్ తెలంగాణ.. దీనిని సాధించాలంటే.. ఏం చేయాలి? బలమైన నాయకుడిగా, తెలంగాణ సారథిగా ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను దెబ్బతీయాలి. పార్టీ పరంగానే కాకుండా.. నైతికంగా కూడా ఆయనను డమ్మీని చేయాలి! అప్పుడే.. అనుకున్నది సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదీ ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు వేస్తున్న ఎత్తు. ఇటీవల దుబ్బాక ఉప పోరులో గెలుపు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో్ దూకుడు.. వంటివి బీజేపీ ఆశలను పెంచిన మాట వాస్తవం. అసలు డిపాజిట్ దక్కుతుందా? అన్న దుబ్బాక లో విజయం, కనీసం పాతిక వస్తే.. చాలనుకున్న గ్రేటర్‌లో ఏకంగా 4 నుంచి 48 సీట్లు బీజేపీ దక్కించుకుంది.
ఏకంగా అడిషనల్ డీజీ అధికారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. తద్వారా మమత సర్కారుపై అవినీతి ముద్ర వేయాలని భావించారు. అయితే.. అది సఫలం కాలేదు. ఇక, తెలంగాణలో తాజాగా ఓ కీలక ఆసుపత్రిపై ఐటీ దాడులు జరిగాయి. అదేసమయంలో ఇద్దరు కీలక పారిశ్రామిక వేత్తలపైనా కేసులు నమో్దయ్యాయి. ఇక్కడ చిత్రమేంటంటే.. వీరంతా కూడా కేసీఆర్‌కు అనుంగులే.. అటు నైతికంగా.. ఇటు ఆర్థికంగా కూడా కేసీఆర్ వీరి నుంచి వారు.. కేసీఆర్ నుంచి లబ్ధి పొందిన వారే. సో.. కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీయాలంటే.. ఇలాంటి వారిని టార్గెట్ చేయడం కరెక్టని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా యశోదా ఆస్పత్రిపై జరిగిన దాడి వెనుక రాజకీయ వ్యూహం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తొలి అడుగు మాత్రమేనని.. త్వరలోనే మరింత పిక్చర్ ఉందని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బీజేపీ సానుకూరులు పోస్టులు పెడుతుండడాన్ని బట్టి.. ఖచ్చితంగా.. కేసీఆర్ కూసాలు కదిలించి.. కాషాయ కూటమి.. ఇక్కడ పునాదులు బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.