కేసీఆర్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్.. పంట పొలాల్లో జరిపిన ముఖరా(కె) విలేజర్స్

-

రైతు బంధువు, మాజీ సీఎం కేసీఆర్‌కు పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముఖరా(కె)గ్రామస్తులు ఆయనకు ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు.మళ్ళీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే కావాలంటూ పంట పొలాల్లో కేసీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేస్తూ, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు.

మళ్ళీ రైతు రాజు కావాలంటే,మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని,కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి రంగంలో అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ బాజా భజంత్రీలు, డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి,ఎంపీటీసీ గాడ్గేసుభాష్,తిరుపతి,ప్రహ్లాద్,దత్త,శ్రీరామ్ మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news