మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లపై క్రూరంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. బిర్యానీ హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఫోన్ పగలగొట్టడంతో.. ఎందుకు పగులగొట్టావని అడిగినందుకు దాడి చేసినట్లు సమాచారం.
దగ్గరుండి మరీ హోటల్ మేనేజరే కస్టమర్లపై దాడి చేయించినట్లు తెలుస్తుండగా..పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.హోటల్ నిర్వాహకులు చేసిన దాడిలో ఓ కస్టమర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.