మారుతున్న సీజన్లో ఫ్లూ వంటి వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి 

-

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొందరికి వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబ వంటివి రావటం మనం చూస్తునే ఉంటాం. సీజన్ చేంజ్ అయిందిగా అందుకే ఇలా అని వాళ్లు చెప్తుంటారు. ముఖ్యంగా అక్టోబర్, ఏప్రిల్ నెలల్లో ఫ్వూ వ్యాధి భారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్లూ కారణంగా తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి స్తంభవిస్తుంటాయి. అసలు ఈ తలనొప్పి, జలుబు బాధ మామూలుగా ఉండదు. చూసేవాడికి, వినేవాడికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఆ బాధపడేవాడికి ఉంటుంది బదనాం అవ్వాల్సిందే..అయితే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.
1. పసుపు పాలు : పసుపు వాడకంతో వ్యాధులను దూరం చేసుకోవడం అనే విషయం మనందరికి తెలిసిన మ్యాటరే. జలుబు చేసిందంటే అమ్మమ్మలు, నాన్నమ్మలు ముందుగా చెప్పేది పసుపు పాలు తాగాలనే. రోజుకు రెండుసార్లు పాలల్లో పసుపు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
2. బేసన్‌ కా షేరా : ఇది ఒక పంజాబీ ఆయుర్వేద చిట్కా. శనగపిండి, నెయ్యి, పాలు, పసుపు, మిరియాలతో దీన్ని తయారు చేస్తారు. వేడి వేడిగా దీన్ని తీసుకుంటే గొంతు, మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనం లభిస్తుంది. అల్లం, మిరియాలు, పసుపులో రోగనిరోధక శక్తి పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
3. ఇంట్లోనే దగ్గుమందు తయారి : అల్లం, తేనె, నిమ్మరసం దీనిలోని ప్రధాన పదార్థాలు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. తేనేలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియాల్‌ గుణాలు ఉన్నాయి. ఆగకుండా వచ్చే దగ్గును ఆపే శక్తి తేనెలో ఉంది.
4. క్యారెట్‌ జ్యూస్‌ : క్యారెట్‌ తింటే కంటి చూపు మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతుంటారు. క్యారెట్‌లో విటమిన్‌ A శ్వాసకోశ వ్యాధుల ముప్పును, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. వేడి వేడి క్యారెట్‌ సూప్ ఒక కప్పు తీసుకుంటే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుందో. అయితే ఈ చిట్కాలు వైద్యుల సలహాకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. క్యారెట్ తో చర్మానికి కూడా చాలా మేలుజరుగుతుంది.
5. కషాయం : పసుపు, తులసితో తయారు చేసిన కషాయాన్ని చాలా మంది తాగే ఉంటారు. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఒంట్లో కాస్త నలతగా అనిపించినప్పుడు తులసి కషాయం తీసుకుంటే చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతుంటారు.

గమనిక: పై చిట్కాలను ప్రాథమిక దశలోనే చేయండి. పరిస్థితి సీరియస్ అవుతుందంటే వైద్యులను సంప్రదించటం మంచిది

 

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version