ఇంటికి ఈ దిక్కున బాంబో ప్లాంట్‌ శుభకరం!

-

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో బ్యాంబో ప్లాంట్‌ (Bamboo Plant)ను పెట్టుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది. వారికి లక్‌ కూడా కలిసివస్తుంది. అందుకే చాలా మంది ఇంట్లో అందుకే ఈ ప్లాంట్‌ను పెట్టుకుంటారు. ఈ ప్లాంట్‌ను ఇంట్లో, కార్యాలయంలో పెట్టుకోవడం వల్ల లక్‌ కలిసివస్తుందని నమ్ముతారు. దీనివల్ల సంపద కూడా పెరుగుతుందని చెబుతారు. పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారని నమ్మకం. కానీ, బాంబో ప్లాంట్‌ను సరైన దిశలో పెట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం బాంబో ప్లాంట్‌ను ఏ దిశలో ఎటువైపు పెట్టుకోవాలో తెలుసుకుందాం.

 

  • సాధారణంగా బాంబో ప్లాంట్‌ను ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా కుటుంబ సభ్యులు తరచూ కూర్చునే ప్రదేశంలో పెట్టుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
  •  ఇంట్లో బాంబో మొక్కను పెట్టుకోవడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. దీంతో పేరు ప్రతిష్టలతోపాటు సంపదలు కలిసివస్తాయి.
  • బాంబో ప్లాంట్‌ను తూర్పు దిశలో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి సమస్యలు రావు. ఇంట్లోకి డబ్బులు కూడా వస్తూనే ఉంటాయి.
  • వ్యాపార ప్రదేశాల్లో ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల నెగెటివ్‌ ఎనర్జీ తొలగిపోతుంది. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version