కీరవాణికి కరోనా పాజిటివ్.. అలర్ట్ అవుతున్న సెలబ్రిటీస్..!

-

మళ్లీ కరోనా.. ఈ మాట వింటేనే ప్రజల వెన్నులో భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజల జీవితాలను ఏ విధంగా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఇక సమస్య సద్దుమణిగింది.. కరోనా పారిపోయింది అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కరోనా బారిన పడ్డారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా.. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా చేశారు దర్శకుడు రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి. ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ కి కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అక్కడ అవార్డు అందుకున్నాక ఆయనకు కోవిడ్ సోకింది. ఆస్కార్ అవార్డుల విషయంలో ఇండియా నుండి అమెరికాకు అలాగే అక్కడ పలుచోట్ల పలు ప్రాంతాలలో తిరిగారు.. వేలాదిమందిని కలిశారు . ఆస్కార్ అందుకొని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వేలాది మందిని కలిశారు.

ఇకపోతే ఇప్పుడు ఇలా కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన బెడ్ పై పడుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. నిన్న రాంచరణ్ బర్తడే సందర్భంగా కూడా ఆయన అక్కడ తన కుటుంబ సభ్యులను కలిసిన విషయం తెలిసిందే. దీంతో గర్భవతి అయిన ఉపాసన కూడా అప్రమత్తం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే కీరవాణిని కలిసిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలని కీరవాణి కోరినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version