సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం పెట్టనున్న కేజ్రీవాల్

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కేజ్రీవాలే స్పష్టం చేశారు. దీని ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోలేదని నిరూపించనున్నారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రచారం వినిపిస్తోంది. సిసోడియాపై సీబీఐ దాడులు జరిగిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్

దీంతో ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగరని కేజ్రీవాల్ నిరూపించనున్నారు. సోమవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ బలపరీక్షతో ఆపరేషన్ లోటస్ కాస్త ఆపరేషన్ కీచడ్ (బురద) అవుతుందని సీఎం అన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 70. ఇందులో ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలు 63 ఉన్నారు. ఒకవేళ కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా ఈజీగా మెజార్టీ నిరూపించుకుంటారని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version