MLC కవిత దగ్గర ఒక్క రూపాయి దొరకలేదు : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

-

లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బాల్క సుమన్తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారని అన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని విమర్శించారు. లాయర్కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేశారంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్ధం అవుతుందని అన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారని అడిగారు. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదని చెప్పారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవని.. అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారని అన్నారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news