శబరిమల భక్తులకు షాకిచ్చిన కేరళ సర్కార్..

-

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పినరయి విజయన్ సర్కార్ షాకిచ్చింది. అయ్యప్ప మాలల సీజన్ దగ్గరపడటంతో తాజాగా కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది.శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతిస్తామని ప్రకటించింది. మకరవిళక్కు సీజన్‌ దగ్గరపడుతుంటంతో సీఎం పినరయి శబరిమల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

శబరిమల పాద యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. అది కూడా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అని స్ఫష్టంచేశారు. వర్చువల్‌గా బుకింగ్ చేసుకోవడం వల్ల యాత్రికులకు తమ మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కలుగుతుందని అధికారుల చెబుతున్నారు. అయితే, అడవి మార్గం గుండా పాదయాత్ర చేస్తూ వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని శబరిమల అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news