ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2024-25ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఏయే రంగానికి ఎంత కేటాయింపులు చేశారో ఆర్థికమంత్రి పద్దులను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు కట్టాలని, లేదంటే పరీక్షలు రాయనీయమని హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు రూ.3వేల కోట్లతో పాటు 2024-25 బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని దశలవారీగా చెల్లిస్తామని తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.