మండలిలో బెర్త్ కోసం టీడీపీ కీలక నేతలు పట్టు.. అందరికీ ఛాన్స్ దక్కుతుందా..?

-

రెండు విడతల్లో నామినెటెడ్ పదవులను సీఎం చంద్రబాబునాయుడు భర్తీ చేశారు.. టిక్కెట్స్ త్యాగం చేసిన వారికి, స్థానికంగా పట్టున్న నేతలకు రెండో జాబితాలో చోటు దక్కింది.. కానీ టీడీపీలో దశాబ్దాల కాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు లేకపోవడంపై నేతలు అసంతృప్తితో ఉన్నారట.. తమకు నామినెటెడ్ పదవులు వద్దు.. ఎమ్మెల్సీ కావాలని అధినేతను రిక్వెస్ట్ చేసుకుంటున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఇంతకీ ఎమ్మెల్సీ పట్టుబడుతున్న నేతలెవ్వరు..? అధినేత ఆలోచన ఎలా ఉంది..?

ఐదేళ్లు అపోజిషన్ లో పోరాటాలు చేశారు.. పొత్తుల కోసం సీట్లను త్యాగం చేశారు.. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నా.. పార్టీ నిలబెట్టిన అభ్యర్ది కోసం పనిచేశారు.. మరికొన్ని చోట్ల మాజీమంత్రులకు టిక్కెట్లు ఇవ్వకపోయినా.. ధిక్కారస్వరాలు వినిపించకుండా.. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేశారు.. ఇప్పుడు వాళ్లందరూ మా పరిస్థితి ఏంటి బాస్ అంటున్నారట.. దీంతో కొందరు సీనియర్లుకు చైర్మన్ పోస్టులిచ్చిన చంద్రబాబు..మరికొందరికి టీటీడీ పదవులతో సరిపెట్టారు..

ఉమ్మడి కృష్ణాజిల్లా, రాయలసీమ, నెల్లూరుజిల్లాలోని కీలక నేతలకు ఇంతవరకూ ప్రాధాన్యత పోస్టులు దక్కలేదు.. పరిటాల శ్రీరామ్‌, ఏవీ సుబ్బారెడ్డి, కృష్ణాజిల్లాకు చెందిన కమ్మనేతలు రెండో లిస్టులో తమకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు.. కానీ వారిపేర్లు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారట.. దీంతో వారంతా తమకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది..

పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ, మాజీమంత్రి దేవినేని ఉమా, కాపు నేత వంగవీటి రాధా, నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర,బుద్దా వెంకన్న, జలీల్‌ ఖాన్ లు ఎమ్మెల్సీ పదవి కావాలని అధినేతను కోరారట..

ఎక్కువమంది ఎమ్మెల్సీ స్థానాన్ని పట్టుబడుతూ ఉండటంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడికి తలనొప్పిగా మారిందట.. అందరూ బలమైన నేతలు కావడం, ఎమ్మెల్సీ స్తానాలు ఎక్కువగా లేకపోవడంతో.. వారిలో కొందరికి ప్రాధాన్యత కల్గిన పోస్టులను ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది.. నేతలకు సర్దిచెప్పి.. కొందరిని స్టేట్ లెవల్ కార్పొరేషన్ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. మొత్తంగా అసంతృప్తితో ఉన్న సీనియర్లను చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news