పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో రాజ్యసభ కీలక ప్రకటన విడుదల చేసింది. క్వశ్చన్ అవర్ ఉండదు అని పేర్కొంది. అంతే కాకుండా ప్రైవేట్ సభ్యుల బిల్లులు కూడా తీసుకోలేమని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కీలక మార్గదర్శకాలను విడుదల చేసారు. పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమై అక్టోబర్ 1 తో ముగుస్తాయి.
ఇదిలా ఉంటే జీరో అవర్ అన్నీ నార్మల్ గానే ఉంటాయి అని రాజ్యసభ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. వీకెండ్ సెలవలు లేకుండా వీటిని నిర్వహిస్తామని పార్లమెంట్ అధికారులు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలకు వచ్చే వారు 72 గంటల ముందే పరిక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు కరోనా బారిన పడిన సంగతి విదితమే.