రూ.1000 కోట్ల అప్పుకోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

బాండ్ల ద్వారా రూ. 1000 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుణాల కోసం పూచికత్తు బాండ్లు RBI కు సమర్పించగా రూ. 500 కోట్లను 11 ఏళ్లలో, మరో రూ. 500 కోట్లను 23 ఏళ్లలో తిరిగి చెల్లించేలా కాలపరిమితి పెట్టింది. ప్రతి వారం బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్న, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో అంచనాల కంటే తక్కువగానే రుణాలు తీసుకుంది.

అటు.. రెండు రిజర్వాయర్లకు కేసీఆర్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గణపసముద్రం చెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు రూ.55 కోట్లు కేటాయించింది. దీనివల్ల 10వేల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరనుంది. అలాగే బుద్ధారం చెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు రూ. 42.2 కోట్లను విడుదల చేసింది. దీని నిర్మాణంతో 31,038 ఎకరాలకు సాగునీరు అందనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version