ఎల్ఐసీ లో సూపర్ ప్లాన్..రూ.76 లక్షలు పొందే అవకాశం.. లోన్ కూడా..

-

ప్రముఖ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు రకాల పాలసీలను కస్టమర్లకు అందిస్తోంది..తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. ఈ పాలసీలో భీమా రత్న పాలసీ కూడా ఒకటి..ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్న ప్లాన్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఎల్ఐసీ బీమా రత్న పాలసీతో మీరు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 76 లక్షలు పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివీజువల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మనీ బ్యాక్ పాలసీ అని చెప్పుకోవచ్చు.. అదే విధంగా బోనస్ కూడా లభిస్తుంది..ఈ పాలసీని కనీసం రూ. 5 లక్షల మొత్తంతో తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ పొందొచ్చు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించవచ్చు..

ఇక ఈ ప్లాన్ ను 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25ఏళ్లు టెన్యూర్‌తో తీసుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే ప్రీమియం 11 ఏళ్లు కట్టాలి. అలాగే 20 ఏళ్ల టెన్యూర్ అయితే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 25 ఏళ్లు టెన్యూర్ అయితే 21 ఏళ్లు ప్రీమియం కట్టాలి..ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో ఉన్న వారు 25 ఏళ్ల టెన్యూర్‌తో రూ. 20 లక్షల మొత్తానికి ఈ పాలసీని తీసుకుంటే ఎంత ప్రీమియం పడుతుంది.. చివరికి మన చేతికి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..ఒకవేళ పాలసీ దారుడు మరణిస్తే.. నామినీకి కరూ. 53 లక్షలు అందుతాయి..

అంతేకాదు ఈ పాలసిని వారికి లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత రెండెళ్లు పూర్తిగా ప్రీమియం చెల్లిస్తే.. వారికి లోన్ పొందే అర్హత లభిస్తుంది. అందువల్ల ఈ ఫెసిలిటీ కూడా ఉపయోగించుకోవచ్చు…

Read more RELATED
Recommended to you

Exit mobile version