తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెంట్ అందించేందుకు కసరత్తులు చేస్తోంది. ముందుగా సిటీలతో అనుసంధానం చేశాక ఆ తర్వాత గ్రామాలకు సైతం క్వాలిటీ ఇంటర్నెంట్ అందించాలని ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్నెట్‌ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఇప్పటికే ఆయా సంస్థల నుంచి టెండర్లు సైతం ఆహ్వానించింది.
తొలుత 3 నెలలు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఉచితంగా అందించి ఆ తర్వాత తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్రొవైడర్‌తో ఓటీటీ చానెల్స్‌తో టైఅప్ అయ్యి వాటిని కూడా అందించేందుకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లకు టీఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించి డిజిటల్ వినియోగాన్ని పెంచడం ద్వారా నిరుద్యోగలకు సైతం ఉపాధి కల్పించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.