ఏపీలోని విశాఖపట్నం పీఎం పాలెంలో గర్భిణీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.2022 డిసెంబర్‌లో అనూష, జ్ఞానేశ్వర్ ప్రేమ వివాహం చేసుకున్నారని.. పెళ్లి విషయం ఇంట్లో చెప్పకుండా దాచిన జ్ఞానేశ్వర్.. అనూష ప్రెగ్నెంట్ అని తెలియగానే వదిలించుకునే ప్రయత్నం చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
తనకు క్యాన్సర్ వచ్చిందని, పెళ్లి విషయం తమ తల్లిదండ్రులకు తెలిస్తే చంపేస్తారంటూ జ్ఞానేశ్వర్ డ్రామాలు ఆడాడని..మాట వినకపోవడంతో చివరకు భార్య అనూషను గొంతునులిమి భర్తే హత్యచేశాడని పోలీసులు వెల్లడించారు. విచారణలో తానే ఈ హత్య చేసినట్లు జ్ఞానేశ్వర్ అంగీకరించడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.