గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్త్రీ సమ్మిట్ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొని మాట్లాడారు. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్న సీవీ ఆనంద్ అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. నగరంలోని 7 జోన్లలో 7 మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయన్న సీపీ గుర్తుచేశారు. ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారన్న సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో మహిళల భద్రత కోసం మరిన్ని పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు.