నాగర్ కర్నూలు జిల్లాలోని పదరా మండలం రాయల్ గండి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల/కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుహ్యంగా అదృశ్యమైంది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని 10 రోజుల పాటు ఇంటికి వెళ్లి గురువారం ఉదయం 11 గంటలకు పేరెంట్స్ వచ్చి వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.ఆ తర్వాత ఏదో కారణం చెప్పి పాఠశాల నుంచి ఆ విద్యార్థిని నిన్న సాయంత్రం 3.45 గంటలకు కాలేజీ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
విద్యార్థిని ఆ విధంగా వెళ్లిపోవడానికి పాఠశాల ఎస్‌ఓ నిర్లక్ష్యమే కారణమని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థిని పాఠశాల నుంచి మిస్ అయిన విషయం వాస్తవమే అని, ఓ ఆటోలో వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సద్దాం తెలిపారు.