అంగన్వాడి కేంద్రాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును సమీక్షిస్తున్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు.
అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు నేనే మంత్రిగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా ప్రకటించారు సీతక్క. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు సీతక్క. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీతక్క.