రికార్డ్స్ కా బాప్ రాఖీభాయ్..బాలీవుడ్ చరిత్ర తిరగరాస్తున్న KGF2

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF2 ఫిల్మ్ ఈ నెల 14న విడుదలై, అంచనాలను మించి దూసుకుపోతున్నది. చాప్టర్ వన్ కు కొనసాగింపుగా వచ్చిన చాప్టర్ టూ..ఎవరూ ఊహించని విధంగా రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. బాక్సాఫీసు వద్ద రాఖీభాయ్ విధ్వంసం సృష్టిస్తున్నారడు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ బద్ధలు కొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

బాలీవుడ్ లో ‘బాహుబలి 2’ క్రియేట్ చేసిన రికార్డులన్నిటినీ తిరగ రాసిన కేజీఎఫ్ 2 ఫిల్మ్..తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 చిత్రం రూ.200 కోట్ల మార్క్ ను ఆరు రోజుల్లో క్రాస్ చేయగా, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే KGF2 క్రాస్ చేసింది. అలా హిందీ చిత్ర సీమలో ఇప్పటి వరకు ఏ హిందీ ఒరిజినల్ సినిమా చేయలేదు.

ఈ సినిమా విడుదలై ఐదు రోజులు అవుతున్నా థియేటర్స్ వద్ద జనాల సందడి తగ్గడం లేదు. అంచనాలను మించి ఈ సినిమా విశేష ఆదరణకు నోచుకుంటున్నది. KGF2 పిక్చర్..భవిష్యత్తులో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పొ్చ్చు. ఇక సినిమా సక్సెస్ ను మూవీ యూనిట్ సభ్యులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో యశ్ తన ఫ్యామిలీ కలిసి మాల్దీవ్స్ కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version