సెక్రటేరియట్ వద్ద ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఫోటోలు వైరల్ గా మారాయి. కాసేపటి క్రితమే తెలంగాణ సచివాలయం ముందుకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలోనే… ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందుగా సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే టెలిఫోన్ భవన్ నుంచి… సచివాలయం చేరుకుంది మహాగణపతి.

ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి… హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. సరిగ్గా ఒకటిన్నర గంటల ప్రాంతంలో… ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నిమజ్జనం అవుతుంది. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీస్ అధికారులు. దాదాపు పదిలక్షల మంది ఈ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. 30 వేల మంది… పోలీసులు రంగంలోకి దిగారు.
తెలంగాణ సచివాలయం చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి pic.twitter.com/WDL8thoICT
— Sarita Avula (@SaritaAvula) September 6, 2025