ఫెస్ట్‌వల్‌ ట్రీట్‌ ఇచ్చిన రవితేజ… “ఖిలాడీ” నుంచి అదిరిపోయే సాంగ్‌

-

మాస్‌ మహారాజ్‌ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “ఖిలాడీ”. రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్పి పతాకం పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరి పోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ గ్లింప్స్‌ ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా దర్శకుడు రమేష్‌ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫస్ట్‌ సాంగ్‌ గ్లింప్స్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో హీరోయిన్‌ నడుము అందాలతో రెచ్చగొడుతోంది. ఇక పాట పూర్తి వీడియో ను సెప్టెంబర్‌ 10 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. కాగా.. ఈ సినిమా విడుదల డేట్‌ పై ఎలాంటి క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news