నాకు ఎంపీ టికెట్ వద్దు.. సజ్జలతో మొరపెట్టుకున్న వైసీపీ అభ్యర్థి..!

-

నాకు వద్దు ప్రభు ఎంపీ టికెట్. నా పొన్నూరు టికెట్ నాకు ఇచ్చేయండి చాలు అంటూ ఎంపీగా పోటీ చేసే కెపాసిటీ నాకు లేదని గుంటూరు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి పొన్నూరు ఎమ్మెల్యే కి కిలారి రోశయ్య పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన సజల రామకృష్ణారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటికే రోశయ్య ఒక రౌండ్ చుట్టేశారు. పరిస్థితులు అనుకూలంగా లేదని ఆయన భావించినట్టు తెలుస్తోంది.

తెలిసి తెలిసి ఓటమిని అంగీకరించలేక మామ ఉమారెడ్డి వెంకటేశ్వరలు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి లని తోడుగా తీసుకువెళ్లి సజ్జలకి తన గోడు చెప్పుకున్నారు తొలి కృష్ణుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణ అభ్యర్థిగా పోటీలోకి దిగి నాకు వద్దు ఈ టికెట్ అని వెళ్లిపోయారు ఊహించిన పరిణామంతో అధిష్టానం కిలారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది పొన్నూరు టికెట్ ఆశించిన రోశయ్య కి ఎంపీ టికెట్ ప్రకటించినప్పటికీ కూడా హుషారు లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version