SRHలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్లో మ్యాచ్ ఆడనివ్వనని బాంబ్ పేల్చారు దానం నాగేందర్. హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లకు టికెట్స్ దొరకక పోవడం దారుణమన్నారు. హైదరాబాద్ లో టికెట్స్ దొరకక పోవడానికి ప్రధాన కారణం HCA అంటూ విరుచుకుపడ్డారు. HCA కంప్లమెంటరీ పాస్ బ్లాక్ లో అమ్ముతుందన్నారు. HCA తీరు పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ క్రీడా కారుడు ఉండేలా చూడాలి..ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడా కారులు లేకపోవడం దారుణమని వెల్లడించారు. జెమిని కిరణ్, సన్ రైజర్స్ ఫ్రాంచజీ మొత్తం పై చర్యలు తీసుకోవాలి..10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయంటూ నిలదీశారు. టికెట్స్ పారదర్శకంగా అమ్మకాలు జరగాలి..బ్లాక్ టికెట్స్ దందా పై వచ్చే మ్యాచ్ లలో జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు దానం నాగేందర్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే దానం.