విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించి చెప్పనక్కర్లేదు. విజయ్ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. తాజాగా ఆయన కొన్ని ఫేక్ వార్తలపై, అలాంటి వార్తలు రాసిన వెబ్‌సైట్స్‌పై విరుచుకుపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయ్ చేస్తున్న మంచి పనులను వక్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేస్తూ.. ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లను ఎండగట్టాడు. విజయ్ చర్యలకు మద్దతుగా టాలీవుడ్ మొత్తం కదిలివస్తోంది.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, అల్లరి నరేష్, కార్తికేయ, తమన్, మెహర్ రమేష్, నాగబాబు వంటి వారు స్పందించారు. విజయ్ తాము అండగా ఉంటామని సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. విజయ్‌కు మద్దతుగా నిలిచాడు.
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don’t let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020
చిరంజీవి స్పందిస్తూ.. ‘డియర్ విజయ్ మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము నీ వెంటే ఉంటాము.. ఏది ఏమైనా మంచి చేయాలనే నీ ఉద్దేశ్యాన్ని మాత్రం మార్చుకోకు. మీ వ్యక్తిగత ఉద్దేశ్యాలను వార్తల్లా రాయకండని జర్నలిస్ట్ మిత్రులను నేను సవినయంగా కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.
@TheDeverakonda hai vijay i strongly support your #killfakenews #killgossipwebsites.its already too late from the film industry to react certain parasitic websites who are like leeches drinking blood from the film industry.thank you for your reaction.Time to take action my boy
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 5, 2020
నాగబాబు స్పందిస్తూ.. ‘నేను నీకు మద్దతు తెలుపుతున్నాను. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌సైట్స్‌పై స్పందించడం ఇప్పటికే ఆలస్యం అయింది. నువ్ స్పందించిందుకు ధన్యవాదాలు. యాక్షన్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం’ అంటూ పేర్కొన్నాడు.
ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు 🙏🏽
YOU INVESTED YOUR TIME MONEY AND EFFORT TO MAKE THIS HAPPEN. WE RESPECT YOU FOR THAT. BUT UNFORTUNATELY WE ARE IN A WAR ZONE. AND WE HAVE TO FIGHT BACK. YOU ARE MY FIGHTER💪🏽 WE SUPPORT YOU MAN @TheDeverakonda #KillFakeNews— PURIJAGAN (@purijagan) May 5, 2020
పూరి జగన్నాద్ స్పందిస్తూ.. ‘ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టావ్ నువ్.. ఇదంతా జరగాడినికి నీ సమయాన్ని, డబ్బును ఖర్చు చేశావ్.. దానికి నిన్ను గౌరవిస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు మనం యుద్దంలో ఉన్నాము.. మనం వెనక్కి తిరిగి యుద్దం చేయాల్సి వస్తుంది.. నువ్ నా ఫైటర్.. నీకు సపోర్ట్‌గా మేమున్నాము’ అంూట ట్వీట్ చేశాడు.