కిమ్ కి సవతి పోరు

-

కిమ్ జోంగ్ ఉన్… ఈ పేరు ప్రపంచ౦లో ఒక సంచలనం. ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయపడతాయి. ఆయన విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఎంత బలమైన దేశం అయినా సరే అనుకుంటుంది. కిమ్ తో పెట్టుకోవడం అంటే అణు బాంబు తో పెట్టుకున్నట్టే అని భావిస్తాయి చాలా దేశాలు. బాబు ఆ విధంగా అన్ని దేశాలను భయపెడుతున్నాడు. అగ్ర రాజ్యం అమెరికా కూడా అతనికి భయపడుతుంది. అతని దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కి కూడా మైండ్ పోయింది.

అలాంటి వ్యక్తి ఇప్పుడు సవతి పోరులో ఉన్నాడట… సాధారణంగా కిమ్ కి అమ్మాయిల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అతను ఏ దేశం వెళ్ళిన సరే అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని అంటారు. తన కేబినేట్ లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయికి పెళ్లి అయింది… అయితే దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష విధించారు. మరి కిమ్ ఆ అమ్మాయి కోసం శిక్ష వేసాడు అని అంటారు గాని అది నిజమో కాదో తెలియదు.

అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ఆమె గురించి భార్యకు బాబు దూరంగా ఉన్నాడట. ఆ దేశ రాజధాని పాంగ్యాంగ్ కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ అతనిది మాత్రమే. అక్కడికి గతంలో అతని భార్యతో కలిసి వెళ్ళే వాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయితో కలిసి అక్కడ ఉన్నాడట, ఈ విషయం తెలిసిన అతని భార్య అతని మీద ఆగ్రహంగా ఉందని, వీరి మధ్య గొడవలు కూడా అవుతున్నాయని, భార్య మాట్లాడట౦ లేదని కిమ్ ఆమెకు నచ్చజెప్పే పనిలో ఉన్నాడని, అసలు ఫ్యామిలీ గొడవలతోనే అతను బయటకు రాలేదు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version