Kim Jong Un – flood victims: ఉత్తరకొరియా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తలు నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. నిత్యం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్.
ఉత్తరకొరియా దేశంలో చంగాంగ్ ఫ్రావించి వరదల్లో ఏకంగా 1000 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుంచి 30 మంది అధికారులకు.. ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది