కరోనాపై కిమ్ చిట్కాలు.. టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్ అంట..!!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అప్పట్లో గొప్పలు చెప్పుకుంది. వ్యాక్సిన్లు వద్దంటూ ఇతర దేశాల నుంచి సహాయాన్ని కూడా తిరస్కరించింది. అయితే ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా పంజా విసురుతోంది. ఈ మేరకు వైరస్‌ను కట్టడి చేసేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా కిమ్ దేశ ప్రజలకు చేసిన సూచనలు చర్చనీయాంశంగా మారాయి. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లే బెస్ట్ అని, ఉప్పు నీటితో నోరు పుకిలించటంతోపాటు ఇంటి చిట్కాలు పాటించాలని సూచించారు.

kim

సంప్రదాయ చికిత్సలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓ మహిళ ఆ దేశ అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటితో పుకిలించడం వల్ల వైరస్ నాశనం అవుతుందన్నారు. దీంతోపాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడు సార్లు తాగాలని సూచించినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆకులకు జ్వర లక్షణాలను తగ్గించే గుణం ఉంటుందన్నారు. అలాగే అల్లం టీ కూడా తాగాలన్నారు. అప్పుడు కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version