నవ్వుల రాజు.. రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు

-

కామెడీ హీరోగా తనదైన శైలిలో మెప్పించి కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు ఈ నటుడు. చిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా ఎంచుకొని నవ్వుల రారాజు అయ్యాడు. హీరోగా ,కేరక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన నటుడు రాజేంద్ర ప్రసాద్. తన నటనతో ఎన్నో అద్భుతాలను సృష్టించి నట కిరిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్ 1956 జూలై 19న. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన గమ్యం వెతుక్కుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని… చిన్న చిన్న వేషాలతో సర్దుకు పోతూన్న రాజేంద్ర ప్రసాద్‌ తొలి చిత్రం 1977లోని స్నేహం. 1982లో వొచ్చిన మంచుపల్లకి చిత్రంతో బ్రేక్‌ వొచ్చింది.

హాస్య బ్రహ్మ జంధ్యాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ చేసిన ‘రెండురెళ్ల ఆరు’, ‘అహనా పెళ్లంట’ మంచి పేరు తెచ్చి పెట్టాయి. లేడిస్ టైలర్, ఏప్రిల్ 1, మాయలోడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఇ.వి.వి సత్యనారాయణ తీసిన సినిమాలో అప్పుల అప్పారావులో ఆయన పండించిన హాస్యం అందర్ని కడుపుబ్బ నవ్వించింది.

రాజేంద్ర ప్రసాద్ కేవలం హాస్య నటుడే కాదు. అద్భతమైన నటుడు కూడా. అన్ని పాత్రలో ఇట్టే ఒదిగి పోతారు. హాస్య ప్రధాన పాత్రలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిల్యూట్స్‌లో ఎన్నొ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్రమందారం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు.

తన అద్భుత నటనతో నట కిరీటి అనిపించుకున్న రాజేంద్ర ప్రసాద్ కి ఇంతటి విజయం దక్కిందంటే పేరులోనే విజయాన్ని పెట్టుకున్న భార్య పాత్ర కీలకం అయింది. ఎందుకంటే ఒకదశలో వరుస అపజయాలతో దెబ్బతినేసి,కుంగిపోతున్న సమయంలో తాను చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆంధ్ర చార్లీ చాంప్లిన్ రాజేంద్ర ప్రసాద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news