రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న కిరణ్ అబ్బవరం

-

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల టాలీవుడ్లో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా కూడా వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇంకొన్ని రోజులలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో సింపుల్గా జరిగింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కిరణ్ అబ్బవరం తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చేశాడు.ఆ తర్వాత రాజావారు రాణిగారు సినిమాలో వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. కాగా వీరి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news