IPL 2024 : RCB పేరులో స్వల్ప మార్పు!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారీ అభిమానగణం ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. స్టార్‌ ప్లేయర్ లతో కళకళలాడే ఈ టీం తనదైన రోజు ఎంతటి బలమైన టీమ్‌నైనా చిత్తుగా ఓడించగలదు.

లీగ్‌ దశలో బాగా ఆడి కీలకమైన ప్లేఆఫ్స్‌లో చేతులెత్తేస్తూ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌తోనే సరిపెట్టుకావాల్సి వచ్చింది .ఈసారైనా టైటిల్‌ కల నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. ఐపీఎల్‌ 2024 సీజన్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన పేరులో చిన్న మార్పు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు Royal Challengers Bangalore అని రాస్తుండగా, ఇకపై Bengaluruగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ సూచన మేరకు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందట. ఇందుకు సంబంధించి రిషభ్ శెట్టితో రూపొందించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) లో పోస్టు చేసింది. ఈ వారంలోనే అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news