గత కొద్దీ రోజుల నుండి బ్రో సినిమాలో పృథ్వి చేత చేయించిన డ్యాన్స్ గురించి ఏపీ మంత్రికి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్యన మాటల వార్ నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా తిరుపతి జనసేన నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న కిరణ్ రాయల్ అంబటి రాంబాబు పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి గట్టి కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేవాళ్ళు ఎవరూ లేరంటూ మాట్లాడారు. అంబటి పవన్ కళ్యాణ్ గురించి నీకు ఇష్టం వచ్చిన దగ్గర కంప్లైంట్ చేసుకో వెంట్రుక కూడా పీకలేవు అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు కిరణ్ రాయల్. పవన్ కళ్యాణ్ మాట ఢిల్లీలో వింటారు, కానీ గల్లీ నేతగా ఉన్న అంబటి మాటలు ఎవ్వరూ పట్టించుకోరంటూ సెటైర్ వేశాడు కిరణ్. సినిమా గురించి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధం అయిన మంత్రి అంబటి పోలవరం కోసం ఏనాడైనా ఢిల్లీ మెట్లెక్కాడా అంటూ కిరణ్ ప్రశ్నించాడు.
అంబటి చేస్తున్నవన్నీ ఉడత బెదిరింపులు .. వీటికి ఎవ్వరూ భయపడే ఛాన్స్ అంటూ కొట్టిపారేశారు కిరణ్ రాయల్.