మాకు ఏ రాష్ట్రంపై వివక్ష లేదు. అన్ని రాష్ట్రాలను అభివృద్ది పథంలో తీసుకెళ్తున్నాం- కిషన్ రెడ్డి

-

మాకు ఏరాష్ట్రంపై వివక్ష లేదు. కేంద్రం అన్ని రాష్ట్రాలను అభివృద్ది పథంలో తీసుకెళ్లుతున్నాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్రం మంత్రి గడ్కరీతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయిచేయి కలిపి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ డెవలప్మెంట్ కు పని చేస్తున్నామని అన్నారు. ఏయిర్ కనెక్టివిటీ,  రోడ్ కనెక్టవిటీ, సీ కనెక్టివిటీని డెవలప్ చేస్తున్నాం అన్నారు. విశాఖపట్నంలో అనేక రకాల పరిశ్రమలకు సహకరిస్తున్నాంమని ఆయన అన్నారు. ఏపీలో పేద ప్రజలకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం సహరిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతుందని ఆయన అన్నారు. 175 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామన్నారు. కరోనా సందర్భంగా దేశంలో 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యం పంపిణీ చేశామన్నారు కిషన్ రెడ్డి. ప్రజలు, ప్రభుత్వాాలు కలిసి పనిచేయాలన్నారు. తెలుగు ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మనదేశాన్ని, మన రాష్ట్రాలను అభివ్రుద్ధి చేసుకోవాలని అని అన్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో రోడ్ కనెక్టవిటీ పెరిగేలా చేశామని.. నేషనల్ హైవేలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కు రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version