ప్రధాని మోడీ తెలంగాణలో రేపు పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు కిషన్ రెడ్డి. సీఎం వైఖరి తెలంగాణకు నష్టం కలిగిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిజాం రాజ్యాంగం కుదరదన్నారు కిషన్ రెడ్డి. మోడీ సహకారం లేకుండానే కాళేశ్వరం పూర్తయిందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ప్లెక్సీల డిజైన్ ప్రగతిభవన్ లో జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజల మద్దతు తమకు ఉందన్నారు.
కేసీఆర్ కు తెలంగాణ అభివృద్ది పట్ల ప్రజల పట్ల ఎలాంటి గౌరవం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం తన కుంటుబం గురించే కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో మహిళ గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలను లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్ పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి… ఎక్కువ రోజులు అబద్దాలతో కాలం గడపలేరన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. వీటిపై రోజూ ప్రశ్నిస్తామని, వదిలే ప్రసేక్తే లేదన్నారు. నిజాం నియంతృత్వ పాలనకు త్వరలో స్వస్తి పలుకుతామన్నారు కిషన్ రెడ్డి.