ఆడవాళ్లు ప్రతి రోజు అనేక పనులని చెయ్యాల్సి ఉంటుంది. విశ్రాంతి కూడా లెకుండా ఏదో ఒక పని చెయ్యాల్సి ఉంటుంది. అయితే మనం చేసే కొన్ని పనుల్లో ఈ చిట్కాలని కనుక పాటిస్తే పని సులభం అవుతుంది. అలానే శుభ్రంగా కూడా ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ చిట్కాలని చూసేయండి. మీ పని స్మార్ట్ గా అవ్వడమే కాదు ఈజీగా అయిపోతుంది.
అలానే మీరు గ్యాస్ స్టవ్ బర్నర్స్ ని శుభ్రం చేస్తున్నారనుకోండి.. వాటిని క్లీన్ చేయటానికి సిరంజి నీడిల్స్ ఉపయోగిస్తే ఇట్టే బర్నర్స్ ని సులువుగా శుభ్రం చేయవచ్చు. కాబట్టి ఇలా చేసేయండి.
గాజు గ్లాసులను కనుక శుభ్రం చెయ్యాలంటే… ముందు కొంచెం నీటి లో బట్టలకు ఉపయోగించే బ్యూ తీసుకుని ఆ గ్లాసులుని కడిగితే… అవి తళతళ మెరుస్తాయి. కాబట్టి ఈ సింపుల్ టెక్నీక్ ని ఫాలో అవ్వండి.
పాత్రలపై ఉన్న స్టిక్కర్స్ సులభంగా ఊడాలంటే, ఆ స్టిక్కర్ కి కొవ్వొత్తి వేడి చూపితే సరిపోతుంది.
అలానే మీరు ఎప్పుడైనా ఆకుకూరలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచాలని అనుకుంటే.. తడి బట్ట లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలా చేస్తే పాడైపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి.
అలానే కాకరకాయ చేదు పోవాలంటే కాకరకాయ వండే సమయం లో పచ్చి మామిడి కాయ ముక్కలు వేస్తె కనుక కాకరకాయ చేదు పోతుంది, కూర రుచిగా కూడా ఉంటుంది.